ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. అత్యున్నత జాతీయ పురస్కారం అందించిన స్లోవేకియా
- 'ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్' అవార్డును ప్రదానం చేసిన స్లోవేకియా అధ్యక్షుడు
- ఈ పురస్కారం 140 కోట్ల భారతీయులకు అంకితమని మోదీ వ్యాఖ్య
- ప్రధాని మోదీకి లభించిన 33వ అంతర్జాతీయ పురస్కారం ఇది
- పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య 11 ఒప్పందాలపై సంతకాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారం చేరింది. ఆయనకు స్లోవేకియా దేశ అత్యున్నత జాతీయ పురస్కారమైన 'ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ (ఫస్ట్ క్లాస్)'ను ప్రదానం చేశారు. బ్రాటిస్లావాలో జరిగిన ఒక కార్యక్రమంలో స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని ఈ అవార్డును మోదీకి అందజేశారు. ప్రధాని మోదీ అందుకున్న 33వ అంతర్జాతీయ పురస్కారం ఇది.
ఈ గౌరవంపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఈ పురస్కారం 140 కోట్ల మంది భారతీయులకు చెందిందని అన్నారు. "ఈ సాయంత్రం 'ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్' అందుకోవడం గౌరవంగా ఉంది. ఈ గౌరవానికి స్లోవేకియా ప్రజలకు, ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. భారత్, స్లోవేకియా మధ్య శాశ్వత స్నేహానికి ఈ అవార్డును అంకితం చేస్తున్నాను" అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
'ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్' అనేది విదేశీ పౌరులకు మాత్రమే స్లోవేకియా ప్రభుత్వం అందించే అత్యున్నత పౌర, సైనిక పురస్కారం. యూరప్ పర్యటనలో భాగంగా మోదీ స్లోవేకియాలో పర్యటిస్తున్నారు. ఒక భారత ప్రధాని ఈ దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య వలసలు, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు 11 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. రెండు దేశాల మధ్య సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచినట్టు అధికారులు తెలిపారు.